Andhra Pradesh: అమరావతిలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం

  • ఏపీ రాజధానిలో చంద్రబాబు పర్యటన
  • చంద్రబాబుకు నిరసనల సెగ
  • అమరావతిలో ఉద్రిక్తత
ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా దుండగులు రాళ్లు రువ్వడం, చెప్పులు విసరడం వంటి చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ నేతలే తమపై దాడులకు దిగారంటూ కొందరు వ్యక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, చంద్రబాబు గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి గూండాలను తీసుకువచ్చి దాడులు చేయించారని వారు ఆరోపిస్తున్నారు. రాజధానికి తాము కూడా భూములు ఇచ్చామని, భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా దాడులు చేయిస్తారా? అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు,
Andhra Pradesh
Amaravathi
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News