Telugudesam: టీడీపీ నేతలు బీజేపీతో టచ్ లో వున్న మాట వాస్తవమే: సోము వీర్రాజు

  • పార్టీ బలోపేతం కోసమే ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నాం
  • రాజకీయనేతల భాష హుందాగా వుండాలని బాబు చెబుతున్నారు
  • గతంలో చంద్రబాబు, వారి నేతలు ఎలా మాట్లాడారో గుర్తుచేసుకోవాలి!
  సంచలన వ్యాఖ్యలకు మారుపేరు అయిన బీజేపీ నేత సోము వీర్రాజు మరోమారు అదే తరహా కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. పార్టీ బలోపేతం కోసమే ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. రాజకీయ నాయకులు వుపయోగించే భాష హుందాగా వుండాలంటున్న చంద్రబాబు.. గతంలో ఆయన, వారి నేతలు మాట్లాడిన మాటలను ఓసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. 
Telugudesam
Chandrababu
BJP
Somu veerraju

More Telugu News