Chandrababu: అందుకే రాళ్లు, చెప్పులతో కొడుతున్నారు: ఏపీ మంత్రి కొడాలి నాని

  • నేడు అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • బస్సుపై చెప్పులు, రాళ్లు రువ్విన గుర్తు తెలియని వ్యక్తులు
  • చంద్రబాబుపై దాడి చేయాల్సిన అవసరం మాకు లేదన్న కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ వ్యవహరంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.  వైసీపీనే ఈ దాడి చేయించిందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై దాడి చేయాలంటే అమరావతిలోనే చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల ముసుగులో చంద్రబాబుపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ప్రజలను మోసం చేశారు కాబట్టే... వారు రాళ్లు, చెప్పులతో కొడుతున్నారని అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు అమరావతిని చంద్రబాబు గాలికొదిలేశారని... ఇప్పుడు బుద్ధి వచ్చినట్టుందని, అందుకే అమరావతిలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Chandrababu
Kodali Nani
Telugudesam
YSRCP

More Telugu News