Chandrababu: దాడులు చేయడం సరికాదు: చంద్రబాబు స్పందన

  • రాజధాని అమరావతిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
  • రాజధాని అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం
  • ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు
  • రైతులు త్యాగాలు చేసి భూములిచ్చారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. చంద్రబాబు, టీడీపీ నేతల బస్సులపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. నల్ల జెండాలతో వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల ఆందోళనకు దిగారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు.

ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. రాజధాని అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే వారిని అవమానిస్తున్నారని చంద్రబాబు అన్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను చూసే పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని, ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు.
Chandrababu
YSRCP
Telugudesam

More Telugu News