Nepal: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు లోయలోపడి 17 మంది దుర్మరణం

  • మృతుల్లో ఎనిమిది మంది మహిళలు
  • మరో పదిమందికి తీవ్రగాయాలు
  • సింధికార్క- రూపందేహీ రోడ్డులో ఘటన

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టిన ఘటనలో 17 మంది దుర్మరణం పాలవ్వగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.


నేపాల్ లోని అర్ఘకాచి జిల్లాలోని సింధికార్క నుంచి రూపందేహీ జిల్లా కేంద్రానికి నిన్న సాయంత్రం ఘాట్ రోడ్డులో బయలు దేరిన బస్సు మార్గమధ్యంలో అదుపుతప్పింది. బస్సును కంట్రోల్ చేయడంలో డ్రైవర్ విఫలం కావడంతో లోయలోకి బస్సు దూసుకు పోయి, బోల్తా కొట్టింది. దీంతో బస్సు ప్రయాణికుల్లో అత్యధికులు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన 10 మందిని నేపాల్ పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Nepal
Road Accident
17 died
10 injured

More Telugu News