Nizamabad District: బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు

  • గత అర్ధరాత్రి ఇసుక తరలింపు వివాదంలో ఘర్షణ
  • తమపై దాడి చేశారని ఆచన్ పల్లి యువకుల ఫిర్యాదు  
  • ముగ్గురు యువకులు దొంగతనం చేశారని షకీల్ అనుచరుల ఆరోపణ
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గత అర్ధరాత్రి ఇసుక తరలింపు వివాదంలో బోధన్‌ మండలం అచన్‌పల్లిలో రెండు వర్గాల ఘర్షణ చెలరేగింది. దీంతో తమపై దాడి చేశారని ఆచన్ పల్లికి చెందిన ముగ్గురు యువకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. షకీల్ సోదరుడు సోహెల్ తో పాటు మరో ఎనిమిది మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం, షకీల్ అనుచరులు కూడా పలువురు యువకులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు దొంగతనం చేశారని షకీల్ అనుచరులు ఆరోపించారు. దీంతో ఆ యువకులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  
Nizamabad District
TRS
Police

More Telugu News