Russia: 18 వేల ఏళ్లనాటి శునక కళేబరం లభ్యం.. తాజాగా శరీర భాగాలు!

  • అతి శీతల ప్రాంతంలో కప్పబడడంతో నేటికీ తాజాగా ఉన్న శునకం
  • డోగర్‌గా నామకరణం
  • రెండేళ్ల వయసులోనే మరణించి ఉంటుందని నిర్ధారణ
రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని మంచు కింద 18 వేల ఏళ్ల నాటి మంచుయుగం శునక కళేబరం లభ్యమైంది. అత్యంత శీతల ప్రాంతంలో కప్పబడి ఉండడంతో దాని శరీరంలోని చాలా భాగాలు కుళ్లిపోకుండా ఇప్పటికీ తాజాగా ఉన్నట్టు  శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ శునకానికి డోగర్ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ డోగర్.. తోడేళ్లు, నక్కలకు మధ్యస్త జాతికి చెందినదని అంచనా వేశారు. దీనికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన స్వీడన్ శాస్త్రవేత్తలు ఇది మగ కుక్కేనని తేల్చారు. రెండేళ్ల వయసులోనే అది మరణించి ఉంటుందని నిర్ధారించారు.
Russia
siberia
Dogar

More Telugu News