Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్ధవ్ థాకరే నుంచి ఫోన్!

  • మోదీకి ఆహ్వాన లేఖను పంపిన ఉద్ధవ్
  • ఆఫై ఫోన్ చేసి ఆహ్వానం
  • అభినందనలు తెలిపిన ప్రధాని
మహారాష్ట్రకు నేటి సాయంత్రం 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న శివసేన నేత ఉద్ధవ్ థాకరే, ఈ కార్యక్రమానికి అతిథిగా రావాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికను పంపిన ఆయన, ఫోన్ చేసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఉద్ధవ్ ఫోన్ ను అందుకున్న మోదీ, అభినందనలు తెలిపారు.

కాగా, ఉద్ధవ్ తరఫున న్యూఢిల్లీకి వెళ్లిన ఆదిత్య థాకరే, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లను కలుసుకుని ముంబై రావాలని కోరారు. తన తరఫున ఓ బృందాన్ని పంపుతానని సోనియా వెల్లడించినట్టు సమాచారం. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘెల్ లతో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్ తదితరులు ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలుస్తోంది.

ఇక ఉద్ధవ్ తో పాటు ఎన్సీపీ నాయకులు జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌ బల్, శివసేనకు చెందిన సుభాష్ దేశాయ్, ఏకనాథ్ షిండే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్‌ లు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
Narendra Modi
Uddhav Thakre
Phone

More Telugu News