Guntur District: ‘టిక్ టాక్’పై మోజుతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం.. భార్యను హత మార్చిన భర్త!

  • గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • పొట్లూరులో వివాహితను హతమార్చిన భర్త
  • ఈ నెల 17న ఈ దారుణం జరిగినట్టు సమాచారం
గుంటూరు జిల్లా పొట్లూరులో వివాహితను భర్తే హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాల ప్రకారం, సువార్తమ్మ, నర్సయ్యగౌడ్ భార్యాభర్తలు. ‘టిక్ టాక్’ మోజులో పడి వివాహేతర సంబంధం పెట్టుకుందని తన భార్యపై నర్సయ్య గౌడ్ కు అనుమానం.

ఈ నేపథ్యంలో ఆమెతో తరచుగా గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు తార స్థాయికి చేరడంతో వాళ్లిద్దరూ విడిపోయారు. కుమార్తెను తన తల్లిదండ్రుల వద్ద వదిలేసిన సువార్తమ్మ, లేడీస్ హాస్టల్ లో చేరింది. సువార్తమ్మపై కక్ష పెంచుకున్న నర్సయ్య గౌడ్ ఆమెను హతమార్చేందుకు ఓ పన్నాగం పన్నాడు.

ఈ క్రమంలో, కలిసి కాపురం చేద్దామంటూ నమ్మబలికి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం నర్సయ్య గౌడ్ తన అన్న వెంకయ్యతో కలిసి సువార్తమ్మను హతమార్చాడు. తర్వాత, గ్రామ శ్మశానానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు స్థానికుల సమాచారం.
Guntur District
potluru
Tiktok
murder

More Telugu News