Minister: మంత్రి బొత్సకు టీడీపీ నేత శ్రవణ్ కుమార్ సవాల్!

  • అమరావతిని శ్మశానంలా చేశారన్న బొత్స వ్యాఖ్యలపై ఫైర్
  • చీపురుపల్లికి, తుళ్లూరుకు పోటీ పెట్టుకుందామా?
  • ఏది శ్మశానంలా కనిపిస్తోందో చూద్దామా?
టీడీపీ హయాంలో రాజధాని అమరావతిని శ్మశానంలా చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ స్పందిస్తూ, బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లికి, గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన తుళ్లూరుకు పోటీ పెట్టుకుందామని, ఏది శ్మశానంలా కనిపిస్తోందో చూద్దామంటూ బొత్సకు సవాల్ విసిరారు.

 అవసరమైతే, మధ్యవర్తులను లేదా జడ్జిలను పెట్టుకుందామని సూచించారు. బొత్స ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన రైతుల త్యాగాలను చులకన చేసి మాట్లాడుతున్నారంటూ బొత్సపై ధ్వజమెత్తారు.
Minister
Botsa Satyanarayana
Telugudesam
sravankumar

More Telugu News