BJP: మోదీ ఫొటో లేకుండా ఒక్క శివసేన ఎమ్మెల్యే అయినా గెలిచేవాడా?: అమిత్ షా

  • సీఎం పదవి ‘శివసేన’కు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పలేదు
  •  ఆ పదవిపై వ్యామోహంతోనే శివసేన వెళ్లిపోయింది
  • విలువలకు శివసేన కూటమి తిలోదకాలిచ్చింది
సీఎం పదవిపై వ్యామోహంతోనే బీజేపీ నుంచి శివసేన వెళ్లిపోయిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. సీఎం పదవి ‘శివసేన’ కు ఇస్తామని ఎన్నికలకు ముందు తాము హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నిర్వహించిన సభల్లో, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య పాల్గొన్న సభల్లోనూ ఫడ్నవీసే సీఎం అని చెప్పామని గుర్తుచేశారు. సైద్ధాంతికతకు, విలువలకు తిలోదకాలు ఇచ్చి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని విమర్శించారు. ఎన్నికల్లో మోదీ ఫొటో లేకుండా ఒక్క శివసేన ఎమ్మెల్యే అయినా గెలిచేవాడా? అని ప్రశ్నించారు.  
BJP
shiva sena
Uddav Thackrey
Amit Shah

More Telugu News