YCP MP Magunta Srinivas Reddy meet with PM Modi: ప్రధాని మోదీతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భేటీ

  • రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించా  
  • ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు వినతి
  • పొగాకు బోర్డులో స్థానికులకు అవకాశమివ్వాలని కోరా
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలిశారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి  శ్రీనివాసులరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సాగుతున్న నేపథ్యంలో శ్రీనివాసులరెడ్డి మోదీతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాలను మాగుంట మీడియాకు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయాలను ప్రధానితో చర్చించానన్నారు. ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించానన్నారు. పొగాకు బోర్డులో స్థానికులకు అవకాశమివ్వాలని కోరానని చెప్పారు.
YCP MP Magunta Srinivas Reddy meet with PM Modi

More Telugu News