Guntur District: వైసీపీ నేతల దాడులపై నారా లోకేశ్ ఎదుట వాపోయిన టీడీపీ కార్యకర్తలు!

  • లోకేశ్ ను కలిసిన ముట్లూరు గ్రామ టీడీపీ కార్యకర్తలు
  • టీడీపీకి మద్దతు తెలిపారని ఎస్సీ కుటుంబాలపై దాడులు చేశారు
  •  గ్రామాల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు
గుంటూరు జిల్లా ముట్లూరు గ్రామ టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేత నారా లోకేశ్ ను కలిశారు. ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపారంటూ అరవై ఎస్సీ కుటుంబాలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని, దొంగ కేసులు బనాయిస్తున్నారని లోకేశ్ కు చెప్పారు. టీడీపీ మద్దతుదారులు 180 మందిని గ్రామాల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ లోకేశ్ ఎదుట వారు  వాపోయారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, గ్రామానికి పార్టీ తరపున ఓ కమిటీని త్వరలోనే పంపిస్తామని హామీ ఇచ్చారు. కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ చేసే న్యాయపోరాటానికి సహకారం అందిస్తామని వారితో లోకేశ్ చెప్పినట్టు సమాచారం. 
Guntur District
Mutlur
Telugudesam
Nara Lokesh

More Telugu News