Kasi Vishwanadh: రవిబాబు వల్లనే నటుడిని అయ్యాను: దర్శకుడు కాశీ విశ్వనాథ్

  • మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది 
  •  దర్శకత్వ శాఖలో చాలాకాలం పనిచేశాను 
  • నటుడిగా ఇంతవరకూ 150 సినిమాలు చేశాను
రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా కాశీ విశ్వనాథ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "మొదటి నుంచి నాకు సినిమాలపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందువలన అసిస్టెంట్ డైరెక్టర్ గా .. కో డైరెక్టర్ గా చాలా సినిమాలకి పనిచేస్తూ వెళ్లాను. దాంతో ఇండస్ట్రీలో నేను ఎవరనేది అందరికీ తెలిసింది.

అలా దర్శకత్వంపై దృష్టి పెట్టిన నన్ను నటుడిగా చేసింది రవిబాబు. నేను అన్నవరంలో ఉండగా కాల్ చేసి, 'నచ్చావులే' సినిమాలో నాకు వేషం ఇస్తున్నట్టుగా చెప్పాడు. నటుడిగా నా ప్రయాణం ఆ సినిమా నుంచి మొదలైంది. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంతవరకూ 150 సినిమాల వరకూ చేశాను. నటుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోగలిగినందుకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చారు.
Kasi Vishwanadh
RaviBabu

More Telugu News