Nagarjuna: నా కెరియర్లో నేను మరిచిపోలేని సినిమా అది: సీనియర్ హీరోయిన్ ఆమని

  • రాఘవేంద్రరావుగారు ఛాన్స్ ఇవ్వడం అదృష్టం 
  • నాగార్జునగారి జోడీగా చేయడం విశేషం
  • చాలా గ్లామరస్ గా చూపించారన్న ఆమని
తెలుగు తెరపై కళ్లతోనే నవరసాలను పలికించిన కథానాయికలలో ఆమని ఒకరుగా కనిపిస్తారు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఘరానా బుల్లోడు' సినిమాను గురించి ప్రస్తావించారు.

"రాఘవేంద్రరావుగారు దర్శకత్వం వహించిన 'ఘరానా బుల్లోడు' సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. ఆ సినిమాలో నన్ను ఆయన చాలా అందంగా చూపించారు. నేను చాలా గ్రాండ్ గా కనిపించింది ఆ సినిమాలోననే నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో నాగార్జునగారితో కలిసి చేసే అవకాశం లభించడం మరో విశేషం. నా కెరియర్లో ఒక మరిచిపోలేని సినిమాగా 'ఘరానా బుల్లోడు'ను చెప్పుకోవచ్చు" అని అన్నారు.
Nagarjuna
Aamani

More Telugu News