BalaKrishna: బాలకృష్ణగారు కోపంగా ఉండటం నేను చూడలేదు: సీనియర్ హీరోయిన్ ఆమని

  • బాలకృష్ణగారితో 'టాప్ హీరో' చేశాను
  • వర్క్ విషయంలో ఆయన చాలా సీరియస్ గా వుంటారు
  • ఆయనను చూశాక అంకితభావం పెరిగిందన్న ఆమని  
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ ఆమని మాట్లాడుతూ, బాలకృష్ణను గురించి ప్రస్తావించారు. "బాలకృష్ణగారితో కలిసి నేను 'టాప్ హీరో' సినిమాలో చేశాను. ఆయనకి కోపం ఎక్కువని చాలామంది అంటూ ఉండగా విన్నాను. కానీ నేను మాత్రం ఆయన కోపంగా ఉండటం చూడలేదు. సెట్లో అందరితోనూ ఆయన చాలా సరదాగా వుంటారు.

వర్క్ విషయంలో ఆయన చాలా సిన్సియర్ గా .. సీరియస్ గా వుంటారు. ఇక డాన్స్ ల విషయానికొస్తే పెర్ఫెక్ట్ గా వచ్చిందని ఆయన నమ్మేవరకూ ప్రాక్టీస్ చేస్తూనే వుంటారు. ఫలానా మూమెంట్ చాలా కష్టంగా వుంది .. మార్చమని మాత్రం ఆయన డాన్స్ మాస్టర్ కి చెప్పరు. అంతపెద్ద హీరో అంతలా కష్టపడుతుండటం చూసినప్పుడు, నేను ఇంకా ఎంతటి అంకితభావంతో ఉండాలనే విషయం నాకు అర్థమయ్యేది" అని చెప్పుకొచ్చారు.
BalaKrishna
Amani

More Telugu News