JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, కోడలికి హైకోర్టు నోటీసులు

  • త్రిశూల్ సిమెంట్ కంపెనీకి సున్నపురాయి మైనింగ్ లీజులో మోసం జరిగిందంటూ కేసు
  • 2011లో హైకోర్టులో పిల్ వేసిన మురళీప్రసాద్ రెడ్డి
  • గత నెలలో దివాకర్ రెడ్డి సహా పలువురికి నోటీసులు
టీడీపీ నేత దివాకర్ రెడ్డి కుటుంబానికి హైకోర్టు షాకిచ్చింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు విషయంలో ఆయన కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థకు, బిజినెస్ పార్టనర్ వేణుగోపాల్ రెడ్డికి కూడా నోటీసులిచ్చింది. ఈ కేసును నిన్న విచారించిన హైకోర్టు... తదుపరి విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, లైమ్ స్టోన్ మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందంటూ తాడిపత్రికి చెందిన మురళీప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి 2011లో హైకోర్టులో పిల్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు గత నెలలో దివాకర్ రెడ్డి సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆయన కుమారుడు, కోడలికి నోటీసులిచ్చింది.
JC Diwakar Reddy
Son
Daughter in law
High Court
Telugudesam

More Telugu News