China: అతడి గొంతు, ముక్కు భాగాల్లో జలగలు.. రెండు నెలలుగా రక్తం పీల్చుతూ పెరిగిన వైనం

  • చైనాలో ఘటన
  • బ్రాంకోస్కోపీ పరీక్ష చేసిన వైద్యులు
  • ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైనం 
తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించిన వైద్యులు అతడి గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. వెంటనే అతడికి ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన చైనాలోని  ప్యూజిన్‌ ప్రావిన్స్‌లోని వుపింగ్ కౌంటీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అతడికి ముందు సిటీ స్కాన్‌ చేసినా అసలు సమస్య ఏంటో తెలియరాకపోవడంతో బ్రాంకోస్కోపీ పరీక్ష చేసినట్లు వైద్యులు తెలిపారు.
 
ఆ వ్యక్తి  గొంతు, ముక్కు భాగాల్లోంచి తీసిన జలగలు ఒక్కోటి 1.2 అంగుళాల సైజు  ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. జలగలు ఉన్న నీటిని అతడు తాగి ఉండొచ్చని, దీంతో అతడి శరీరంలోకి అవి ప్రవేశించి ఉండొచ్చని వివరించారు. ఆ జలగలు రెండు నెలలుగా అతడి రక్తం పీల్చుతూ పెరిగాయన్నారు.
China
offbeat

More Telugu News