shiv sena: భార్య రష్మీతో కలిసి గవర్నర్ తో సమావేశమైన ఉద్ధవ్ థాకరే

  • గవర్నర్ తో ఉద్ధవ్ మర్యాదపూర్వక భేటీ 
  • రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం
  • దాదర్ లోని శివాజీపార్క్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన భార్య రష్మీతో కలిసి ఈ రోజు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సమావేశమయ్యారు. గవర్నర్ తో ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. కాగా, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నిన్న ముంబయిలోని ట్రైడెంట్ హోటల్‌లో సమావేశమై ఉద్ధవ్ థాకరేను తమ కూటమి నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

దీంతో రేపు సాయంత్రం 6.40 గంటలకు దాదర్ లోని శివాజీపార్క్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఉద్ధవ్ థాకరే సిద్ధమవుతున్నారు. థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తి ఉద్ధవ్ థాకరేనే.
shiv sena
BJP
Congress

More Telugu News