Prabhas: ప్రభాస్ లాంటి మంచి మనిషిని నేను చూడలేదు: పూజా హెగ్డే

  • ప్రభాస్ తో 'జాన్' సినిమా చేస్తున్నాను 
  • ఆయనను దగ్గరగా చూసే అవకాశం దక్కింది 
  • తమ ఇద్దరికీ మటన్ బిర్యానీ ఇష్టమన్న పూజా హెగ్డే  
వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకున్న పూజా హెగ్డే, అదే స్థాయిలో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న 'జాన్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ .."యూరప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటిస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'ఇటలీ'లో చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాతో ప్రభాస్ ను దగ్గరగా చూసే అవకాశం దక్కింది. ఆయన లాంటి మంచి మనిషిని నేను చూడలేదు. తాను ఒక ఇంటర్నేషనల్ స్టార్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి, చాలా కూల్ గా తన పని తాను చేసుకు వెళుతుంటాడు. ఆయనకి, నాకూ 'మటన్ బిర్యాని' అంటే ఇష్టం. సమయం దొరికితే చాలు ఇద్దరం కలిసి లాగించేస్తుంటాము" అని చెప్పుకొచ్చింది.
Prabhas
Pooja hegde

More Telugu News