East Godavari District: ఆర్థిక లావాదేవీలతో ఫైనాన్స్ వ్యాపారిని కర్రతో కొట్టి చంపేసిన వ్యాపార భాగస్వామి

  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • ఘాతుకానికి పాల్పడిన వ్యాపార భాగస్వామి
  • కలకలం రేపిన హత్య
తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని తుని సీతారాంపురంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వ్యాపార భాగస్వామే అతడిని హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లమిల్లి రాజారెడ్డి, కర్రి మారెడ్డి ఇద్దరు ఫైనాన్స్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల వీరి మధ్య వ్యాపార, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగిన ఘర్షణలో సహనం కోల్పోయిన కర్రి మారెడ్డి కర్రతో రాజారెడ్డిని కొట్టి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
East Godavari District
murder

More Telugu News