Srikalahasti: శ్రీకాళహస్తి సమీపంలోని కాలభైరవ ఆలయంలో తమిళుల క్షుద్రపూజలు!

  • శ్రీకాళహస్తికి సమీపంలో కాలభైరవ ఆలయం
  • పూజలకు సహకరించిన ఏఈఓ ధనపాల్
  • పరారీలో ఆలయ సెక్యూరిటీ గార్డులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో కొంతమంది తమిళులు క్షుద్రపూజలను నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల సంగతిని తెలుసుకున్న పోలీసులు ఐదుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంలో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్‌ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Srikalahasti
Kalabhairava
Black Magic
Arrest
Police

More Telugu News