Chiranjeevi: తనను పార్టీకి పిలవలేదని చిరంజీవిపై అలనాటి దర్శకనటుడి అసంతృప్తి

  • చిరంజీవి నివాసంలో అలనాటి తారల సమాగమం
  • తనను పిలవలేదని ప్రతాప్ పోతన్ ఆవేదన
  • తాను అర్హుడ్ని కానేమోనంటూ వ్యాఖ్యలు
గత కొన్నేళ్లుగా దక్షిణాది చిత్ర పరిశ్రమల ప్రముఖులు 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' పేరుతో కలుసుకుంటూ వేడుకలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, ప్రభు, జయసుధ, జయప్రద, సుమలత, రాధిక వంటి వాళ్లు క్రమం తప్పకుండా ఈ 80 రీయూనియన్ పార్టీలకు హాజరవుతూ పాతజ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటారు. తాజాగా వీరందరూ హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో వేడుకలు జరుపుకున్నారు.

అయితే ఈ సంబరాలకు తనను పిలవలేదని ప్రముఖ దర్శకనటుడు ప్రతాప్ పోతన్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆహ్వానం అందుకునేందుకు నేను అర్హుడ్ని కానేమో. నేను ఏమంత గొప్పనటుడ్ని, దర్శకుడ్ని కాదేమో. అందుకే చిరంజీవి గారు నన్ను ఆహ్వానించలేదనిపిస్తోంది. ఏదేమైనా చాలా బాధగా ఉంది. జీవితం అంటే ఇంతే. నేను తీసిన సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు" అని వ్యాఖ్యానించారు.
Chiranjeevi
Pratap Pothan
Class Of Eighty

More Telugu News