Janasena: ‘జనసేన’కు మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శుల నియామకం

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి సత్యనారాయణ (సత్య), కార్యదర్శులుగా గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు, మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు నియమించినట్టు పేర్కొంది. ఈ రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ముగ్గురు కొన్ని సంవత్సరాలుగా పార్టీకి విలువైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. విశాఖ నగరానికి చెందిన సత్య పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పార్టీ తరపున పని చేస్తారని పేర్కొన్నారు. 
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Boli setti
chillapalli

More Telugu News