Guntur District: గుంటూరు జిల్లాలో లంచం తీసుకున్న వీఆర్వో సస్పెన్షన్

  • చినకాకాని వీఆర్వో కృష్ణ కిశోర్
  • అడంగల్ లో పేర్ల నమోదుకు డబ్బు వసూలు
  • రైతుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు
రైతుల నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వీఆర్వో కృష్ణ కిశోర్ లంచం తీసుకున్న ఆరోపణలు రుజువు కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అడంగల్ లో పేర్ల నమోదు నిమిత్తం తమ నుంచి కృష్ణ కిశోర్ డబ్బులు వసూలు చేసినట్టు రైతులు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సంబంధిత అధికారులకు రైతులు అందజేశారు. దీనిపై విచారణ నిర్వహించి, ఆరోపణలు రుజువు కావడంతో కృష్ణ కిశోర్ ను పదవి నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Guntur District
chinna kakani
VRO

More Telugu News