MS Dhoni: ధోనీపై ఊహాగానాలు వద్దు, ఐపీఎల్ వరకు ఆగండి: రవిశాస్త్రి

  • వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరంగా ధోనీ
  • ధోనీ లేకుండానే జట్టును ఎంపిక చేస్తున్న సెలెక్టర్లు
  • ఐపీఎల్ లో ధోనీ ఆటతీరును పరిశీలిస్తామన్న రవిశాస్త్రి
టీమిండియాలో ధోనీ కనిపించక నెలలు గడుస్తోంది. వరల్డ్ కప్ తర్వాత ధోనీ జట్టుకు దూరమయ్యాడు. తాను అందుబాటులో ఉండేదీ లేనిదీ ధోనీ చెప్పకపోగా, అటు సెలెక్టర్లు కూడా ధోనీ లేకుండానే జట్టును ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ భవితవ్యంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు.

 ధోనీ మైదానంలో దిగితేనే ఓ స్పష్టత వస్తుందని అన్నారు. అందుకు ఐపీఎల్ వరకు ఆగాలని, ఇప్పటినుంచే ఊహాగానాలు చేయవద్దని తెలిపారు. ఐపీఎల్ లో ధోనీ ఆటతీరే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ముందర జరిగే ఐపీఎల్ ఆటగాళ్ల ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
MS Dhoni
Ravishastri
India
Cricket
T20 World Cup

More Telugu News