బాలయ్య సినిమాలో నటించబోతున్న రోజా?

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో గతంలో ఎన్నో సినిమాలు వచ్చి, బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీరిద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. బాలయ్య సినిమాల్లో కూడా నటిస్తుండగా... రోజా టీవీ షోల ద్వారా బుల్లి తెరపై సందడి చేస్తున్నారు.

తాజాగా బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొత్త చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ రోల్ పోషించబోతున్నారు. ఇందులో ఓ పవర్ ఫుల్ లేడీ పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర కోసం రోజాను బోయపాటి శ్రీను సంప్రదించగా... ఆలోచించి చెబుతానని ఆమె సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. రోజా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ఇద్దరి అభిమానులకు పండగే.
Go Back to Shorts
Balakrishna
Roja
New Film
Boyapati Sreenu
Sanjay Dutt

More Telugu News