Srikakulam District: ఊసరవెల్లి కాదు.. సముద్రపు కప్పే.. రంగులు మారుస్తోంది!

  • శ్రీకాకుళంలో మత్స్యకారులకు చిక్కిన చేప
  • పెద్ద చేపలకు చిక్కకుండా శరీరాకృతి మార్పు
  • జపాన్‌లో విపరీతమైన డిమాండ్
సాధారణంగా ఊసరవెల్లి రంగులు మారుస్తుంటుంది. శత్రువులకు చిక్కకుండా ఉండే ప్రదేశాన్ని బట్టి దాని శరీరం రంగులు మారిపోతుంటాయి. ఇది కూడా రంగులు మార్చేస్తోంది. అయితే, ఇది ఊసరవెల్లి కాదు.. సముద్రపు కప్ప. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట తీరంలో జాలర్ల వలకు చిక్కింది. బౌల్‌ఫిష్, గ్లోబ్, బెలూన్ ఫిష్‌గా పలు రకాల పేర్లతో పిలిచే దీనిని స్థానిక మత్స్యకారులు మాత్రం సముద్రపు కప్పగా పిలుస్తుంటారు. సాధారణ చేప కంటే దీని నోరు, కళ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. శరీరంపై పెద్దపెద్ద ముళ్లు ఉంటాయి. సముద్రంలో పెద్ద చేపలకు దొర్కకుండా ఇది ఎప్పటికప్పుడు తన శరీర ఆకృతిని మార్చుకుంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ జాతికి చెందిన కొన్ని చేపలకు పొట్టలో విషం ఉంటుందని పేర్కొన్నారు. జపాన్‌లో ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందన్నారు.
Srikakulam District
Japan
rare frog
fish

More Telugu News