Telugudesam: చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారు: బోండా ఉమ

  • అవినీతి జరిగి వుంటే ఎందుకు బయటపెట్టలేదు?
  • బాబుకు వెంటనే క్షమాపణలు చెప్పాలి
  • చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారు
వైసీపీ ఎన్ని కోర్టు మెట్లెక్కినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారని టీడీపీ నేత బోండా ఉమ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగి వుంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేకపోయిందని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు చేస్తోందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ పర్యటన ఆగదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లో ఏం చేసిందో, చంద్రబాబు తన పర్యటనతో తేల్చుతారని అన్నారు. వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూస్తోందని, రాజధానిపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
Telugudesam
Chandrababu
Bonda Uma
YSRCP

More Telugu News