Fliover accident victim Kubra Begam: ఫ్లై ఓవర్ బాధితురాలు కుబ్రా బేగంకు ఏపీ సీఎం జగన్ ఆర్థిక సాయం

  • ఆపరేషన్ కు అయ్యే ఖర్చును ఇస్తామని ప్రకటన
  • తక్షణ సహాయం కింద రూ.3,60,000 మంజూరు  
  • వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వెల్లడి
హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు కుబ్రా బేగంకు అండగా ఉండటానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు వివరాలను వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి తక్షణ సహాయం కింద రూ.3,60,000 మంజూరు చేసిందని చెప్పారు.  

శనివారం గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు ఫ్లైఓవర్ పైనుంచి కింద పడటంతో ఓ మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురంకు చెందిన కుబ్రాబేగం(23) వెన్నెముకకు తీవ్ర గాయంకావడంతో ఆస్పత్రిలో ఆమె ప్రాణాలతో పోరాడుతోంది.

ఈ నేపథ్యంలో ఆమె శస్త్రచికిత్సకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని.. బాధితురాలి తండ్రి అబ్దుల్ అజీం సహాయం కోసం అర్థించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించారని, సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయానికి ఓకే చెప్పారని తెలిపారు.
Fliover accident victim Kubra Begam
AP CM Fund assistance

More Telugu News