Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో యువజంటకు వింత శిశువు జననం

  • రెండు తలలు, మూడు చేతులతో శిశువు జననం
  • ఎంతో అరుదైన కేసుగా గుర్తింపు
  • శిశువు బతికే అవకాశాలు స్వల్పం!
మధ్యప్రదేశ్ లో ఓ యువతి వింత శిశువుకు జన్మనిచ్చింది. రెండు తలలు, మూడు చేతులతో ఉన్న ఆ శిశువును చూసి వైద్యులు సైతం విస్మయానికి గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా బసౌదా గ్రామానికి చెందిన జశ్వంత్ సింగ్, బబిత అహిర్వార్ దంపతులు. తొలిసారి గర్భం దాల్చిన బబిత కోటి ఆశలతో బిడ్డ కోసం ఎదురుచూసింది. అయితే విచిత్ర శిశువు రూపంలో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆమెకు జన్మించింది అవిభక్త కవలలే అయినా ఒకటే శరీరం కలిగి ఉన్నారు. ఈ రెండు తలల శిశువుకు గుండె మాత్రం ఒకటే ఉంది. వైద్య పరిభాషలో ఇలా జన్మించడాన్ని ట్రైబ్రాకియస్ పెరాపేగస్ అంటారు. ఇలాంటి కేసుల్లో శిశువు ఎక్కువకాలం బతికే అవకాశాలు తక్కువ.
Madhya Pradesh
Two Heads Baby

More Telugu News