Deepthi Sree: చిన్నారి దీప్తిశ్రీ కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు

  • సవతితల్లే హత్యచేసిందన్న పోలీసులు
  • సీసీ కెమెరా ఫుటేజ్ కీలకంగా మారిందని వెల్లడి
  • ఈ కేసులో ఇతరుల ప్రమేయంలేదన్న పోలీసులు
కాకినాడలో కిడ్నాప్ కు గురైన చిన్నారి దీప్తిశ్రీ ఉప్పుటేరులో శవమై తేలడం అందరినీ కలచివేసింది. దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారే హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. చేసిన నేరాన్ని ఆమె వెంటనే ఒప్పుకోలేదని, తాము గట్టిగా అడిగేసరికి చిన్నారిని ఏంచేసిందో మొత్తం చెప్పేసిందని వివరించారు. దీప్తిశ్రీ కోసం 5 బృందాలుగా ఏర్పడి గాలించామని తెలిపారు. నిందితురాలిపై కిడ్నాప్, హత్యకేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం దీప్తిశ్రీ తల్లి చనిపోయిందని, చిన్నారి హత్యలో ఇతరుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరా వీడియో ఫుటేజ్ ఎంతో కీలకపాత్ర పోషించిందని చెప్పారు.
Deepthi Sree
Kakinada
Police
Andhra Pradesh

More Telugu News