Mahesh Babu: 'రాజా ది గ్రేట్'లో తల్లి పాత్రను విజయశాంతి చేయనన్నారు: అనిల్ రావిపూడి

  • విజయశాంతిగారిని అప్పుడే కలిశాను 
  • ఆ పాత్రను ఆమె తిరస్కరించారు 
  • ఆమె ఇంటిచుట్టూ తిరిగానన్న అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో విజయశాంతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. అసలు ఇంతకుముందే 'రాజా ది గ్రేట్' సినిమా ద్వారా ఆమెతో రీ ఎంట్రీ ఇప్పించాలని అనిల్ రావిపూడి ప్రయత్నించాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.

'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ తల్లి పాత్రకి విజయశాంతిగారైతే బాగుంటుందని ఆమెను సంప్రదించాను. కానీ ఆ పాత్ర చేయడానికి ఆమె నిరాకరించారు. దాంతో ఆ పాత్రను రాధిక గారితో చేయించడం జరిగింది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని కీలకమైన పాత్రను మాత్రం విజయశాంతిగారితోనే చేయించాలనుకున్నాను.'రాజా ది గ్రేట్' కోసం కలిసినప్పటి  పరిచయంతోనే, 'సరిలేరు  నీకెవ్వరు' కథను విజయశాంతిగారికి వినిపించాలనుకున్నాను. 'స్వాతిముత్యం'లో సోమయాజులు చుట్టూ కమల్ తిరిగినట్టు నేను ఆమె ఇంటి చుట్టూ తిరిగాను. కథ మొత్తాన్ని ఆమె నవ్వుతూనే విన్నారు .. ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" అని చెప్పుకొచ్చాడు.
Mahesh Babu
Rashmika
Vijaya Shanti

More Telugu News