cm: సిటిజెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం జగన్

  • లంచాలను రూపుమాపడమే లక్ష్యంగా చర్యలు 
  • 14400 నంబరుకు ప్రజలు ఫిర్యాదు చేయాలి 
  • ఈ సేవలను వినియోగించుకోవాలని కోరిన జగన్
ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అవినీతిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రజలు ఫిర్యాదు చేసేందుకు సిటిజన్ హెల్స్ లైన్ కాల్ సెంటర్ ను జగన్ ప్రారంభించారు.

14400 నంబరుకు డయల్ చేసి ప్రజలు తమ ఫిర్యాదులు చేయాల్సిందిగా కోరారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు లంచాలను రూపుమాపడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేoదుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని, ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
cm
Jagan
Citizen Help line
call center
14400

More Telugu News