వైఎస్ జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిన విషయాన్ని కవర్ చెయ్యలేరుగా!: బుద్ధా వెంకన్న
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాజాగా చేసిన ట్వీట్లలో ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఐదు నెలల్లోనే ఇసుక కొరతతో 50 మంది కార్మికులను చంపేసింది అబద్ధమా? అన్నా క్యాంటీన్లు ఎత్తేసింది అబద్ధమా? అమరావతి ఆపేసింది అబద్ధమా? అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణపు పనులు నిలిపి వేయడం, విషజ్వరాలతో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పటడం, విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారమయం చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి అని ఆయన, ఆయనకు సంబంధించిన బ్లూ మీడియా ఎంత కవర్ చేసినా, వైఎస్ జగన్ ఫ్రష్ట్రేషన్ పీక్స్ కు చేరిన విషయాన్ని కవర్ చెయ్యలేరుగా! అంటూ సెటైర్లు విసిరారు.