Rahul Gandhi: 'మహా' ఉత్కంఠపై లోక్ సభలో రాహుల్ గాంధీ మండిపాటు.. గందరగోళం మధ్య సభ వాయిదా

షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొంది. సభాపతి పోడియంను చుట్టుముట్టి విపక్ష నేతలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రశ్నోత్తరాలు ముందుకు కొనసాగని పరిస్థితి నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

అంతకు ముందు సభలో మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. 'నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, ఈ పరిస్థితుల్లో ఈ ప్రశ్న అడిగేందుకు కూడా అనువైన పరిస్థితులు లేవు' అని అన్నారు. ఈ విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంపై రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సష్టించారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 
Go Back to Shorts
Rahul Gandhi
Congress
BJP
Maharashtra
Lok Sabha

More Telugu News