Sharwanand: '96' మూవీ రీమేక్ కి విడుదల తేదీ ఖరారైపోయినట్టే

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో క్రితం ఏడాది అక్టోబర్లో వచ్చిన '96' సినిమా భారీ వసూళ్లను సాధించింది. విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. శర్వానంద్ - సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోంది.

తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్, తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే ఆ రోజున విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఉండటంతో. '96' రీమేక్ ను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.
Go Back to Shorts
Sharwanand
Samanta

More Telugu News