Supreme Court: ఒక పవార్ మా వైపు ఉన్నారు.. మరో పవార్ అటు వైపు ఉన్నారు: సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గి

  • వారిలో కుటుంబ కలహాలు ఉండొచ్చు మాకు సంబంధం లేదు
  • 2018 కర్ణాటక కేసుకు దీనికి సంబంధం లేదు
  • ఎన్నికలకు ముందు బీజేపీ మిత్రపక్షంగా శివసేన ఉంది
  • ఆ తర్వాత విభేదాలతో విడిపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు 
మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ వెంటనే బలపరీక్ష ఎదుర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.

2018 కర్ణాటక కేసుకు, దీనికి సంబంధం లేదని ముకుల్ రోహత్గి అన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఎవరూ చెప్పడం లేదని తెలిపారు. ఎన్నికలకు ముందున్న మిత్రపక్షం శివసేన ఆ తర్వాత విభేదాలతో విడిపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత తమకు అజిత్ పవార్ నుంచి మద్దతు లభించిందన్నారు. ఒక పవార్ (అజిత్ పవార్) మా వైపు ఉన్నారు.. మరో పవార్ (శరద్ పవార్)అటు వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారిలో కుటుంబ కలహాలు ఉండొచ్చు, మాకు ఈ విషయంతో సంబంధం లేదని చెప్పారు.
Supreme Court
BJP
ncp

More Telugu News