AR Rahman: కసుమూరు దర్గా గంధోత్సవంలో పాల్గొన్న ఏఆర్ రహమాన్

  • నిన్న ఉదయం దర్గాను సందర్శించుకున్న రహమాన్
  • కుమారుడితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
  • కొన్నేళ్లుగా గంధోత్సవంలో పాల్గొంటున్న రహమాన్
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు దర్గాను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సందర్శించారు. కుమారుడితో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఇక్కడ ప్రతి యేటా నిర్వహించే గంధోత్సవంలో రహమాన్ గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. కుమారుడు అమీన్‌తో కలిసి నిన్న ఉదయం 5:30 గంటల సమయంలో దర్గాకు చేరుకున్న రహమాన్‌.. కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ మస్తాన్‌వలీ సమాధిపై చాదర్‌ కప్పి చేసే ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం తిరిగి పయనమయ్యారు.
AR Rahman
kusumuru darga
music dierctor

More Telugu News