Amaravathi: అమరావతిలో విడ్డూరం... పేకాడుతూ పోలీసులకు పట్టుబడిన మహిళలు

  • ఒకే ఇంట్లో పట్టుబడిన ఎనిమిది మంది మహిళలు
  • విస్మయానికి గురైన పోలీసులు
  • రూ.1.36 లక్షలు స్వాధీనం
ఏపీ రాజధాని అమరావతిలో ఆశ్చర్యం కలిగించే ఘటన చోటుచేసుకుంది. కొందరు మహిళలు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. తాడేపల్లి పట్టాభి సీతారామయ్య కాలనీలో ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు విస్తుపోయారు. అక్కడ పేకాడుతున్నవారంతే మహిళలే కావడంతో విస్మయానికి గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు గతంలోనూ పేకాడుతూ దొరికినవారే కావడం గమనార్హం. కాగా, తాజాగా పట్టుబడిన వారి నుంచి రూ.1.36 లక్షల నగదుతో పాటు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Amaravathi
Andhra Pradesh
Police

More Telugu News