Krishna River: కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న దైద శివాలయం ఈవో అనిత

  • పొందుగల వద్ద కృష్ణానదిలో దూకిన అనిత
  • ఇటీవలే అనితపై అవినీతి ఆరోపణలు
  • భర్తతోనూ విభేదాలు!
గుంటూరు జిల్లా పొందుగల వద్ద విషాదం చోటుచేసుకుంది. దైద శివాలయం ఈవో అనిత పొందుగల వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత స్థానికులు ఆమెను గుర్తుతెలియని వ్యక్తిగా భావించారు. అనంతరం పోలీసుల రాకతో ఆమె శివాలయం ఈవో అని తెలిసింది. ఇటీవలే అనితపై అవినీతి ఆరోపణలు రాగా అధికారులు సస్పెండ్ చేసినట్టు వెల్లడైంది. అటు, వైవాహిక జీవితంలోనూ కలతలు రావడంతో కొన్నినెలలుగా ఆమె భర్త నుంచి దూరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. అయితే అనిత ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇవేనా, లేక మరేదైనా కోణం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Krishna River
Daida
EO
Anitha
Guntur District

More Telugu News