Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన అజిత్ పవార్

  • మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వానికి ప్రధాని శుభాకాంక్షలు
  • స్పందించిన అజిత్ పవార్
  • స్థిరమైన పాలన అందిస్తామని వెల్లడి
మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన ఫడ్నవీస్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం కోసం తాము కట్టుబడి ఉంటామని, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమిస్తామని తెలిపారు.

కాగా, మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కోరుతూ గవర్నర్ ఇచ్చిన సిఫారసు లేఖను, ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖను రేపు కోర్టులో సమర్పించాలని సొలిసిటర్ జనరల్ ను సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.
Narendra Modi
Ajit Pawar
Maharashtra
BJP

More Telugu News