jagga reddy: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంతోషంగా ఉంటామని కార్మికులు అనుకున్నారు: జగ్గారెడ్డి

  • మన పరిపాలనే మనకు శాపమైందా? అంటూ బాధపడుతున్నారు  
  • ఆర్టీసీ ప్రైవేట్‌ పరమైతే ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది
  • కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చింది
  • దీంతో రాష్ట్రాలకు ఈ అవకాశం ఇచ్చినట్లయింది 
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంతోషంగా ఉంటామని కార్మికులు అనుకున్నారని, కానీ ఇప్పుడు మన పరిపాలనే మనకు శాపమైందా? అంటూ బాధపడుతున్నారని విమర్శించారు.

కార్మికుల పట్ల కేసీఆర్ చిన్నచూపు తగదని జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీ ప్రైవేట్‌ పరమైతే ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చట్టం తీసుకురావడంతోనే రాష్ట్రాలకు ఈ అవకాశం ఇచ్చినట్లయిందని తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ మానవత్వంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. 

jagga reddy

More Telugu News