Supreme Court: రాజకీయాల్లోకి వస్తానని నా బాల్యంలో అనుకోలేదు: మోదీ

  • ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలనుకున్నాను 
  • అయోధ్య తీర్పు సమయంలో ప్రజలు చూపిన సద్భావన హర్షణీయం
  • ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు తెలపాలి 
తాను రాజకీయాల్లోకి వస్తానని తన బాల్యంలో అనుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాను ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలనుకున్నానని మన్ కీ బాత్ లో చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా విద్యార్థులు పుస్తకాలు చదవడం మానేసి, అంతర్జాలంలో వెతుకుతున్నారని పేర్కొన్నారు. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు  తీర్పు సమయంలో ప్రజలు చూపిన సద్భావన హర్షణీయమని చెప్పారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వమే మన దేశ నినాదమన్నారు.

ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు తెలిపి ఇందులో పాల్గొనాలని మోదీ కోరారు. చలి కాలంలో వ్యాయామం చేయడానికి మంచి వాతావరణ ఉంటుందని చెప్పారు. నవంబరు 26కి మరో రెండు రోజులు మాత్రమే ఉందని, ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ దినోత్సవమని మోదీ చెప్పారు. భారత రాజ్యాంగ సభలో నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని గుర్తు చేశారు.
Supreme Court
Narendra Modi
BJP

More Telugu News