mumbai: ఊహించని పరిణామం.. శరద్ పవార్ ను కలిసిన బీజేపీ ఎంపీ

షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటోన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ను బీజేపీ ఎంపీ సంజయ్ కాకాడె కలిశారు. ఈ రోజు శరద్ పవార్ ఇంటికి వచ్చి ఆయన కాసేపు భేటీ అవ్వడం చర్చనీయాశంగా మారింది. పవార్ ను వ్యక్తిగతంగానే కలిశానని కాకాడె చెప్పుకుంటున్నారు. కాసేపట్లో సుప్రీంకోర్టులో.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై విచారణ జరగనున్న విషయం తెలిసిందే.

కాగా, ఇటీవలే ప్రధాని మోదీని శరద్ పవార్ కలవడం కూడా పలు అనుమానాలను దారి తీసింది. పవార్ ను వ్యక్తిగత కారణాలతోనే కలిశానని కాకాడె చెప్పుకుంటున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాశం అవుతోంది. కాగా, 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లలో గెలుపొందాయి. బలపరీక్షలో ముఖ్యమంత్రి పడ్నవిస్ ఓడిపోతే ప్రభుత్వ ఏర్పాటు చేయాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి.
Go Back to Shorts
mumbai
Maharashtra

More Telugu News