Pawan Kalyan: ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించండి: పవన్ పై విజయసాయి రెడ్డి విమర్శలు

  • 'మన నుడి, మన నది'.. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది 
  • మీ పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి
  • ఆ తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని కార్యాచరణ ప్రారంభించాలి
  • అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష, నదుల పరిరక్షణకు ఉద్యమం చేయడం కోసం కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ‘మన నుడి.. మన నది’ యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది సినిమా టైటిల్ లా అదిరిపోయిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.  

'మన నుడి, మన నది.. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. ఆ తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని.. కృష్ణా నదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 
Pawan Kalyan
Vijay Sai Reddy
YSRCP

More Telugu News