మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా.. ఇద్దరి మృతి
- హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా ఘటన
- శనివారం అర్ధరాత్రి చీటూరు గ్రామ సమీపంలో వాహనం బోల్తా
- తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
కాన్వాయ్‌లో ఆయన వెనక వస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ పార్థసారథి (30), పూర్ణ (27) అనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అదే వాహనంలో ఉన్న గన్‌మన్ నరేశ్, అటెండర్ తాతారావు, శివలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.