Nara Lokesh: వైఎస్ జగన్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు!: నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రం

  • జగన్ ను విమర్శించిన లోకేశ్
  • ప్రజాధనానికి రివర్స్ టెండర్ పెట్టారంటూ విమర్శలు
  • దోపిడీ చేస్తున్నారని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉల్లిధర పెంచుకుంటూ పోతూ 100 రూపాయలు చేయడం ద్వారా సెంచరీ కొట్టారని, ఇసుక ధర 5 రెట్లు పెంచారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు రూ.5 వేల జీతాన్ని రూ.8 వేలకు పెంచి ఏడాదికి రూ.4 వేల కోట్ల ప్రజాధనానికి రివర్స్ టెండర్ పెట్టారని విమర్శించారు.

ఆఖరికి సొంత పత్రికకు యాడ్ రేట్లు 200 శాతం పెంచి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత మీడియాలో పనిచేసే పరివారానికి ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించి లక్షల్లో జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇన్ని చేస్తున్న జగన్ గారు ప్రజాసంక్షేమానికి మాత్రం కోతలు పెడుతున్నారని, అవ్వాతాతలకు నెలకు రూ.250, రైతులకు రూ.600 ఇస్తూ ఏపీ అప్పుల్లో ఉందంటూ పిట్టకథలు చెప్పడం ద్వారా చెవుల్లో పువ్వులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News