Venkymama: చైతూకి బర్త్ డే విషెస్ తెలిపిన 'వెంకీమామ' యూనిట్

షార్ట్స్‌లో చూడండి
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేశ్, నాగచైతన్య 'వెంకీమామ' అనే ఫ్యామిలీ ఎంటర్టయినర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. మా చైతూకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సురేశ్ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. అంతేకాదు, 'వెంకీమామ'లో వెంకటేశ్ కు, చైతూకు మధ్య వచ్చే సన్నివేశాలు, చైతూ ఆర్మీ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన సీన్లతో కూడిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. కేఎస్ రవీంద్రకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య పక్కన రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Go Back to Shorts
Venkymama
Venkatesh
Naga Chaitanya
Tollywood

More Telugu News