Ajit Pawar: అజిత్ పవార్ ను బ్లాక్ మెయిల్ చేశారు.. అన్ని విషయాలను బయటపెడతాం: సంజయ్ రౌత్

  • బీజేపీకి మద్దతివ్వాలనేది అజిత్ సొంత నిర్ణయం కాదు
  • ఐదుగురు ఎమ్మెల్యేలను అబద్ధాలు చెప్పి తీసుకుపోయారు
  • అజిత్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది
బీజేపీకి మద్దతు పలకాలనే నిర్ణయాన్ని ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్వచ్చందంగా తీసుకోలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అజిత్ ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు. అజిత్ వెంట వెళ్లిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురిని అబద్ధాలు చెప్పి కారులో ఎక్కించుకుని పోయారని తెలిపారు. ఇది కూడా ఒక రకమైన కిడ్నాప్ అని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో త్వరలోనే బయటపెడతామని చెప్పారు. అజిత్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. కాగా, ఎన్సీపీ రెబెల్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే మారిపోయిన పరిణామాలతో శివసేనకు ఊహించని ఎదురుదెబ్బ తగలింది.
Ajit Pawar
Sanjay Raut
BJP
NCP
Shivsena

More Telugu News